Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఫ్లిప్‌కార్ట్‌ 'బిగ్‌ బిలియన్‌ డేస్‌' తేదీలు వ‌చ్చేశాయ్‌.. వారికి ఒక‌రోజు ముందుగానే అందుబాటులోకి సేల్‌!

Flipkart Big Billion Days 2024 Dates Announced
Advertisement
  • సెప్టెంబర్‌ 27వ తేదీ నుంచి బిగ్ బిలియన్ డేస్ సేల్‌ మొదలు
  • ఫ్లిప్‌కార్ట్‌ ప్లస్‌ మెంబర్లకు ఒక రోజు ముందుగానే సేల్‌ అందుబాటులోకి
  • ఈసారి సేల్స్‌లో కస్టమర్లు భారీ ఆఫర్స్ పొందే అవ‌కాశం 
  • త్వరలోనే వెల్లడి కానున్న ఆఫర్ల వివరాలు 
  • స్మార్ట్ టీవీ, ఇత‌ర‌ గృహోపకరణాలపై 80 శాతం వరకు తగ్గింపు ఉండే అవకాశం
Advertisement
పండగ సీజన్‌ వేళ ఆఫర్ల ఫెస్టివల్‌కు ప్ర‌ముఖ ఇ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ తెరలేపింది.  ఏటా నిర్వహించే 'బిగ్‌ బిలియన్‌ డేస్‌' సేల్స్ తేదీలను తాజాగా ప్రకటించింది. సెప్టెంబర్‌ 27వ తేదీ నుంచి బిగ్ బిలియన్ డేస్ సేల్‌ మొదలు కానుందని వెల్లడించింది. ఫ్లిప్‌కార్ట్‌ ప్లస్‌ మెంబర్లకు ఒక రోజు ముందుగానే అంటే సెప్టెంబర్‌ 26 నుంచే సేల్‌ అందుబాటులోకి వ‌స్తుంద‌ని స్ప‌ష్టం చేసింది. 

దీంతో ఈసారి సేల్స్‌లో కస్టమర్లు భారీ ఆఫర్స్ పొందే అవ‌కాశం ఉంది. త్వరలోనే ఆ ఆఫర్ల వివరాలు వెల్లడి కానున్నాయి. ఇక ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లు, దుస్తులు, ఏవైనా గృహోపకరణాలను షాపింగ్ చేయాలనే ప్లాన్‌లో ఉన్న‌వారికి 'బిగ్‌ బిలియన్‌ డేస్' సేల్స్ బాగా ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌నే చెప్పచ్చు.  

ఇక ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2024 సందర్భంగా అన్ని విభాగాల్లో భారీ తగ్గింపులు ఉంటాయని స‌మాచారం. స్మార్ట్ టీవీల‌తో పాటు గృహోపకరణాలపై ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ 80 శాతం వరకు తగ్గింపును అందించే అవకాశం ఉంది. ల్యాప్‌టాప్‌లు, హెడ్‌ఫోన్‌లు, గేమింగ్ ప‌రికాలు, గాడ్జెట్ పరికరాలపై 50 శాతం నుంచి 80 శాతం వరకు తగ్గింపు లభించ‌నుంది.

రిఫ్రిజిరేటర్లు, 4కే స్మార్ట్ టీవీలు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులపై 75 శాతం భారీ తగ్గింపు లభించే అవకాశం ఉంది. ఇక స్మార్ట్‌ఫోన్‌లలో నథింగ్, రియల్‌మీ, ఇన్ఫినిక్స్ వంటి ప్రముఖ బ్రాండ్‌లు ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో గణనీయమైన తగ్గింపులతో రానున్నాయి.

కొన్ని ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మోడళ్లపై పరిమిత కాల వ్యవధిలో బహుళ బ్యాంక్ ఆఫర్‌లు ఉంటాయి. ఒక‌వేళ మీరు ఐఫోన్‌ వంటి ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లు కొనుగోలు చేసే ప్లాన్‌లో ఉంటే.. మీకు ఈ ప్లాట్‌ఫారమ్‌లో కొన్ని అదనపు ఆఫర్‌లను పొందే అవకాశం ఉంది. మరోవైపు ప్రముఖ ఇ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ కూడా గ్రేట్ ఇండియన్‌ ఫెస్టివల్ సేల్‌ తేదీలను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.
Advertisement
Advertisement
Flipkart Big Billion Days
Flipkar

More Telugu News